తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. కోటి విరాళం.. నందమూరి బాలకృష్ణ

-

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలకుతలమైన విషయం తెలిసిందే. దాదాపు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయారు. విజయవాడలో అయితే చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. చుట్టూ వరద చేరింది. దీంతో సినీటి నటుడు బాలకృష్ణ స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు.. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు నందమూరి బాలకృష్ణ.

దాదాపు 50 ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదిటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీ కోసం మీ ఆనందం కోసం.. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు బాలయ్య. 

Read more RELATED
Recommended to you

Latest news