“గుర్తుందా శీతాకాలం” ట్రైలర్..సత్యదేవ్ అదరగొట్టేశాడుగా

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇటీవల ‘గాడ్సే’గా..తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. త్వరలో సత్యదేవ్ నటించిన లవ్ స్టోరి ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి. శాండల్ వుడ్(కన్నడ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుర్తుందా శీతాకాలం’..డెఫినెట్ గా తెలుగులో హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


అయితే.. తాజాగా కొత్త ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. అయితే ఇందులో సత్యదేవ్ గత సినిమాలతో పోలిస్తే చాలా కొత్త సత్యదేవ్ ని మనం చూడవచ్చు. బహుశా తన నుంచి హీరోగా మొదటి లవ్ స్టోరీ కూడా ఇదే కావచ్చు. కాగా ఈ ట్రైలర్ లో మాత్రం తాను మంచి యంగ్ లుక్స్ లో కనిపించి మంచి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే నటుడు ప్రియదర్శితో తన కన్వర్జేషన్ కూడా ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంది.