గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ కు బ్రేక్ పడిందా..?

-

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు ముందు నుంచి ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ ను చేయలేదని చెప్పవచ్చు. చిరంజీవి కూడ ఈ సినిమా హడావిడి కూడా అంతగా కనిపించలేదు.కానీ విడుదలైన తర్వాత మాత్రం ఈ సినిమా ఒక్కసారిగా పాపులర్ అవ్వడమే కాకుండా హీట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా మొదట 5 రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన గత రెండు రోజుల నుంచి కలెక్షన్లు అంతగా రాబట్టలేదని వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా చాలా సెంటర్లలో ఆక్యుమెంట్స్ గణనీయంగా తగ్గిపోయిందని ట్రెండ్ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి.

ప్రధాన నగరాలు, పట్టణాలు తప్ప మిగిలిన చోట్ల హంగామా అంతగా కనిపించలేదు. అయితే గతంలో విడుదలైన కే జి ఎఫ్, RRR వంటి సినిమాలో సూపర్ హిట్ విజయంగా వీక్ డేస్ వరకు నిలిచాయి. అయితే గాడ్ ఫాదర్ చిత్రం మాత్రం వీక్ డే వరకు నిలవలేక పోతుందని సమాచారం. సినిమాకి మాత్రం నెగటివ్ టాక్ రానప్పటికీ.. కలెక్షన్లో కూడా కాస్త డ్రాప్ కనిపిస్తోందని సమాచారం. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా షేర్ ను రాబట్టిందని చెప్పవచ్చు.

గాడ్ ఫాదర్ చిత్రం థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరిగి ఉంటే రూ..50 కోట్లు చాలా తక్కువ సమయంలోనే రాబట్టిందని చెప్పవచ్చు. కానీ ఈ చిత్రం రూ.90 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఎక్కువైందని సమాచారం. ఈ చిత్రం ఇంకా సక్సెస్ కావాలి అంటే రూ.40 కోట్ల రూపాయలకు పైగా రాబట్టాల్సి ఉంది.అయితే ఇది సాధించడం అంత ఈజీ కాదని కూడా చెప్పవచ్చు. మరి రాబోయే రోజులలో ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. ఇక దీపావళికి జిన్నా, సర్దార్, ఓరి దేవుడా, ప్రిన్స్ తదితర చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి గాడ్ ఫాదర్ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news