విజయ్ దేవరకొండ మూవీ లో సూపర్ పాత్ర చేయ బోతున్న సుమంత్.!

-

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా కావాల్సింది. కాని లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత  హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. దీనితో విజయ్ ఫుల్ ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీ సమయంలో కొంత మంది దర్శకుల కథలు విన్నాడుఇక ఇటీవలే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ కాఫ్ పాత్రలో కనిపించనున్నట్లుగా అధికార పోస్టర్ ను బట్టి చూస్తే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం హీరో సుమంత్ ని గౌతమ్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. గౌతమ్ కి దర్శకుడిగా మొదటి అవకాశం మళ్ళీరావా సినిమాతో సుమంత్ ఇచ్చాడు. అలాగే సుమంత్ కి ఆ మూవీతో చాలా కాలం తర్వాత హిట్ వచ్చింది.ఇక ఈ సీనియర్ హీరో ఇప్పుడు ఇతర హీరోల సినిమాలలో కూడా కూడా కీలక పాత్రలు చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపధ్యంలోనే సీతారామం సినిమాలో హీరో హీరోయిన్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం విజయ్ ప్రాజెక్ట్ లో కీలకమైన పాత్ర లో నటించబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news