‘ఆర్ఆర్ఆర్’ : ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ….??

-

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. దాదాపుగా సంవత్సరం పైగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తి అయిందని, ఇక ఇప్పటివరకు తమ సినిమాకు సంబంధించి వస్తున్న పుకార్లను మేము పెద్దగా పట్టించుకోలేదని, అలానే సినిమాను అనుకున్న విధంగా 2020 జులై 30న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లోకి తీసుకువస్తాం అని చెప్పడం జరిగింది. అలానే వాటితో పాటు ఒక బిగ్ అప్ డేట్ కూడా ప్రేక్షకులకు అందించింది ఆర్ఆర్ఆర్ టీమ్.

అదేమిటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రక్కన నటించబోయే హీరోయిన్, అలానే విలన్ పాత్రధారుల డీటెయిల్స్ ని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ నిన్న ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆయన ప్రక్కన నటించే హీరోయిన్ ఈమె అంటూ ఒక హాలీవుడ్ నటి పేరు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ నటి క్యాథరీన్ ల్యాంగ్ ఫోర్డ్ ని ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా, అలానే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రముఖ రష్యన్ నటి ఎలిసన్ డూడీని సెలక్ట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్.

ఇక గతంలో ఎన్టీఆర్ ప్రక్కన మరొక హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేసినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన ఆమె సినిమా నుండి తప్పుకుంది, అందువలన ఆమె స్థానంలో మరొక నటి కోసం కొన్నాళ్లుగా ఆర్ఆర్ఆర్ టీమ్ అన్వేషణ సాగించింది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం నేటి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే….!!

Read more RELATED
Recommended to you

Latest news