అల్లూ అర్జున్ నిజ స్వరూపం బయటపడే టైమ్ వచ్చింది ? 

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఎంత మంచివాడవురా, దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో  టాఫ్ ఫైట్ సరిలేరు నీకెవ్వరు-అల వైకుంఠపురంలో సినిమాల మధ్య నెలకొంది. అయితే రెండు సినిమాలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా బాగా అలరించింది. సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవటం అంతేకాకుండా దానికి ముందే మ్యూజికల్ గా అన్ని పాటలు సూపర్ హిట్ కావడంతో ‘అల వైకుంఠపురంలో’ సినిమా సంక్రాంతి పండుగ విన్నర్ గా నిలిచింది.

Image result for alla vaikuntapuraamloo allu arjun"

దీంతో వసూళ్ళ పరంగా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయడానికి అనేక సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నించినా గాని విఫలం కావడంతో తాజాగా సినిమాకి వస్తున్న కలెక్షన్లు  బట్టి ‘బాహుబలి’ రికార్డులను త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ‘అల వైకుంఠపురంలో’ బ్రేక్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలకు చెందినవారు. దీంతో రికార్డు గురించి గానీ కలెక్షన్ల గురించి గానీ నాకు ఇష్టం ఉండదు మాట్లాడటం అని ఎప్పుడూ చెప్పే బన్నీ ‘బాహుబలి’ రికార్డులను ‘అల వైకుంఠపురంలో’ సినిమా పగలగొడితే ఏవిధంగా రియాక్ట్ అవుతాడో అని అందరు ఎదురు చూస్తున్నారు.

 

‘బాహుబలి’ రికార్డులు బ్రేక్ అయినప్పుడు బన్నీ గొప్పగా కాలర్ ఎగరేస్తే మాత్రం కచ్చితంగా బన్నీకి రికార్డుల మీద ప్రేమ ఉందని నిజ స్వరూపం బయటపడుతుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం నైజాంతో పాటు రెండు మూడు ఏరియాల్లో బాహుబలి 1 కలెక్షన్స్‌ కు దగ్గరగా వచ్చి ఉన్నాయి. ఈ వీకెండ్‌ లో మంచి వసూళ్లు నమోదు అయితే బాహుబలి 1 ను కూడా క్రాస్‌ చేసే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.