హైదరాబాద్ అమ్మాయికి బాలీవుడ్లో బంపర్ ఆఫర్లు..

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలే కష్టమైపోతున్న ప్రస్తుత రోజుల్లో బాలీవుడ్లో తెలుగమ్మాయిలు అవకాశాలు అందిపుచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అదీగాక తెలుగులో అసలు సినిమాలే చేయకుండా బాలీవుడ్ లో ఆఫర్లు కొట్టేయడం అద్భుతమే. ఇవన్నీ చాలా సునాయాసంగా దక్కించుకుంటున్న భామ పేరు అమ్రిన్ ఖురేషి. హైదరాబాద్ కి చెందిన ఈ అమ్మడుకి బాలీవుడ్లో వరుసగా రెండు ఆఫర్లు వచ్చాయి.

రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న బ్యాడ్ బాయ్ అనే చిత్రంలో అమ్రిన్ ఖురేషి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ బ్యాడ్ బాయ్ చిత్రం తెలుగు సినిమా అయిన సినిమా చూపిస్తా మావ కి రీమేక్ గా రూపొందుతుంది. దీంతో పాటు అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి హిందీ రీమేక్ లోనూ నటించనుంది. మొత్తానికి తెలుగమ్మాయికి బాలీవుడ్లో అవకాశాలు రావడం, అదీ తెలుగు సినిమాల హిందీ రీమేక్ లలో రావడం ఆశ్చర్యమే.