ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో పుష్ప-2 మూవీ ప్రీ రీలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై చంచలగూడ జైలు నుంచి విడుదల అయ్యాక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఘటనకు నాకు నేరుగా సంబంధం లేదు. నేను థియేటర్ లోపల ఫ్యామిలీతో సినిమా చూస్తుంటే బయట అనుకోకుండా ఆ ఘటన చోటు చేసుకుంది. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. అంతేకాకుండా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి మరీ మృతి చెందిన రేవతి తనయుడిని పరామర్శిస్తానని, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ వెల్లడించారు.
ఆ ఘటనకు నాకు నేరుగా సంబంధం లేదు : అల్లుఅర్జున్
నేను థియేటర్ లోపల ఫ్యామిలీతో సినిమా చూస్తుంటే బయట అనుకోకుండా ఆ ఘటన చోటు చేసుకుంది
ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
– మీడియా సమావేశంలో అల్లుఅర్జున్… pic.twitter.com/RoazOrHMVG
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024