నాన్న జోలికి వస్తే ఊరుకోను.. చెర్రీ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇటీవల నిన్న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ హైదరాబాదులో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ మీట్ కు చిరంజీవి వారసుడు రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. అంతేకాదు తన నాన్న జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను అంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రామ్ చరణ్ మాట్లాడుతూ..” చిరంజీవి సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్ గా ఉంటేనే ఇన్ని వేల మంది వచ్చాము. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో ఇతరులకు తెలియదు.. ఆయన నెమ్మదిగా ఉంటారేమో.. మేము నెమ్మదిగా ఉండడం.. అందరూ గుర్తుపెట్టుకోండి..” అంటూ రాంచరణ్ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

ఇకపోతే శృతిహాసన్, మెగాస్టార్ చిరంజీవి జంటగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ, కేథరిన్ కీలక పాత్రలు పోషించారు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతూ విజయ డంకా మోగిస్తున్న సందర్భంగా చిత్ర బృందం విజయోత్సవ వేడుకను హనుమకొండ లో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ ఇలా మాట్లాడారు.

“ఒక అభిమానిగా వచ్చా.. చిరంజీవి గారి ఫంక్షన్కు ఆయనే గెస్ట్.. ఇంకెవరు అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను.. ఆయనతో పాటు రవితేజ గారికి మంచి సీరియస్ క్యారెక్టర్ ఇచ్చి దాన్ని కూడా ఎంజాయ్ చేసేలా చేశాడంటే..బాబికే హాట్స్ ఆఫ్. తమ్ముడు అంటే నాన్నగారికి ప్రాణం. ఆ తమ్ముడు మీద ప్రేమ ఎలాంటిది అనేది వాల్తేరు వీరయ్య లో ఒక సీన్లో తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి మేము అందరం వెనకాల క్వైట్ గా ఉండము, క్వైట్ గానే చెబుతున్నాం
. మేము క్వైట్ గా ఉండమని “అంటూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్లు చేసే వారికి ప్రత్యక్షంగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.