కరోనా ఎఫెక్ట్ తో ఆర్.ఆర్.ఆర్ బిజినెస్ తగ్గిపోతే భారీగా నష్టపోయోది రాజమౌళి నా ..?

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకి చాటి చెప్పారు. ఒక్క బాహుబలి సినిమాతో రాజమౌళి మన తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. అప్పటి వరకు హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకున్న యావత్ ప్రపంచం బాహుబలి ఫ్రాంఛైజీ తో హాలీవుడ్ దర్శకులు కూడా మన తెలుగు సినిమా వైపు చూసేలా రాజమౌళి వండర్ ని క్రియోట్ చేశారు. అంతేకాదు టాలీవుడ్ హీరో అన్న ఇమేజ్ నుండి పాన్ ఇండియా స్టార్ అన్న ఇమేజ్ ని ప్రభాస్ కి ఇచ్చారు.

 

ఇక ఎన్.టి.ఆర్ తో తీసిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ నుండి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా ఏరగని రాజమౌళి అంటే చిత్ర పరిశ్రమలో అందరికీ ఆశ్చర్యమే. ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఒకే ఒక్క అగ్ర దర్శకుడు ఏవరు అంటే అందరి వేళ్ళు రాజమౌళి వైపే చూపిస్తాయి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా ‘స్టూడెంట్ నెం.1’ సినిమా తో డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. సింహాద్రి సినిమా నుండి రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా కచ్చితంగా హిట్ అనే నమ్మకాన్ని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కలిగించారు.

ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఎన్టీఆర్, రాంచరణ్ ల తో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ జూన్ లేదా జూలై లో ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు చిత్ర యూనిట్. కాని గ్రాఫిక్స్ వర్క్, సీ.జి వర్క్ కంప్లీటవక పోవడం తో వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేస్తామని అఫీషియల్ గా రాజమౌళి అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ పరంగా టాక్ నడుస్తోంది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా 800 కోట్ల కంటే ఎక్కువ వసూళ్ళని సాధించడం కష్ఠం అన్న అంచనాని వేస్తున్నారు విశ్లేషకులు.

అందుకు కారణం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా. దీని ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల మీద పడనుందని అంటున్నారు. ఆ రకంగా చూస్తే ఈ సినిమా కి బిజినెస్ వ్యవహారాలన్ని దగ్గరుండి చూస్తున్న రాజమౌళి కే ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందట. ఆయన రెమ్యూనరేషన్, షేర్ శాటిలైట్ షేర్ ఇలా అన్నిటిలో రాజమౌళి వాటా బాగా తగ్గుతుందట. మొత్తానికి కరోనా టాలీవుడ్ కి కోట్ల నష్ఠాలనే మిగిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news