“F 3” హిట్ కాకపోతే మళ్లీ మీకు కనపడను..రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. ఇప్పుడు ఎఫ్ 3 తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీన గ్రాండ్ గా విడుదలవుతోంది. అయితే తాజాగా శనివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఎఫ్3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్3 సినీ బృందం అందరూ హాజరయ్యారు. ఎఫ్3 లో ముఖ్య పాత్ర పోషించి అందరినీ నవ్వించనున్నారు రాజేంద్రప్రసాద్.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మనం ఉన్న పరిస్థితులకు, సమాజానికి ఎఫ్3 మూవీ ఎంతో అవసరం. ప్రతిమనిషికీ నవ్వులు పంచే సినిమా ఎఫ్3. నేను నలభై ఏళ్లుగా ఆ నవ్వును నమ్ముకునే ఉన్నానన్నారు. అనిల్ రావిపూడి అద్భుతంగా సినిమా తీశారని తెలిపారు. అయితే ఈ మూవీ హిట్ కాకపోతే గుండెల మీద చెయ్యి వేసుకొని చెపుతున్న మళ్ళీ మీ ముందు నేను ఎప్పుడూ నిలబడను, మీకు కనపడను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. దీనిని బట్టి ఆయనకు ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తోంది.