ఈ టైం గనక సరిగ్గా వాడుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే రష్మిక దే టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ ..!

-

టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ ఇద్దరే. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంంటూ అందరి నోటా వినిపిస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఈ ఇద్దరి గురించే ఫిల్మ్ నగర్ లో నిత్యం చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు ఈ సంక్రాతికి వచ్చిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన రష్మిక తన ఖాతాలో హిట్ ని వేసుకుంది. అలాగే అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే ఊహించనై సక్సస్ ని తన అకౌంట్ లో వేసుకుంది.

 

ఇక పూజా హెగ్డే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేట్సెట్ సినిమా “రాధే శ్యాం” లో నటిస్తుంది. ఇది అఫీషియల్ టైటిల్ కానప్పటికి దాదాపు ఈ టైటి నే యూనిట్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీటయింది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న మూడు భారీ సినిమాలున్నాయి. ఇక కన్నడ బ్యూటి రష్మిక మందన్న సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కూడా అయిదు భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో ఛాన్స్ వస్తుందని రష్మిక ఊహించనేలేదు. ఇక ఈ సినిమా కాకుండా త్రివిక్రం ఎన్.ట్.ఆర్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ సినిమాలో నటించే అవకాశాలున్నాయని సమాచారం.

 

అయితే తాజా పరిణామాలు చూస్తే రష్మిక మందన్న నంబర్ వన్ ప్లేస్ కి వచ్చే అవకాశం ఇదే అంటున్నారు. వాస్తవంగా పూజా హెగ్డే లీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెమ్యూనరేషన్ పరంగాను రష్మికక కంటే పూజా కే ఎక్కువ. అయితే కారణం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల తో ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో లెక్కలన్ని తారుమారయ్యాయి. ముఖ్యంగా భారీగా బెడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించే సాహసాలు దాదాఉ చేయకపోవచ్చు అన్న మాట వినిపిస్తుంది. అంతేకాదు హీరో, హీరోయిన్స్, దర్శకుల రెమ్యూనరేషన్స్ లో కొంత కోత పడనుందని అంటునారు. ముఖ్యంగా హీరోయిన్స్ రెమ్యూనరేషన్ సగం వరకు తగ్గే అవకాశాలున్నాయట. ఇది రష్మిక కి కలిసొచ్చే అంశం అని అంటున్నారు. రష్మిక కంటే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఎక్కువ కాబట్టి… పూజా హెగ్డే గనక కాంప్రమైజ్ అవకపోతే నెక్స్ట్ ఛాయిస్ రష్మిక నే. సో కాస్త కాంప్రమైజ్ అయితే రష్మిక మందన్న పూజా హెగ్డే ని బీట్ చేసి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news