గ్రామాల కోసం కేసీఆర్ సంచలన నిర్ణయం…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కట్టడి చేస్తున్నా సరే ఇది మాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితి లేకపోవడం తో కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా కట్టడి కావడం లేదని ఆయన ఉన్నతాధికారుల సమీక్షలో వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల మీద కూడా దృష్టి పెట్టాలి అని ఆయన సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. జోన్స్ గా కూడా విభజిస్తున్నారు.

అన్ని జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణాలో రోడు విడిచి రోజు నిత్యావసర సరుకులకు అనుమతి ఇస్తున్నారు. దాన్ని రెండు రోజులకు ఒకసారి పెంచే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా మారే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి కఠిన ఆంక్షలను అమలు చెయ్యాలని ఆయన భావిస్తున్నారు.

రాష్ట్రం మొత్తం ఆరెంజ్ జోన్ గా ప్రకటించి ప్రజలను ఎవరిని కూడా బయటకు రాకుండా ఖాళీ గా ఉన్న ఆర్టీసి బస్సులను గ్రామాలకు తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నారు. గ్రామాల విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. గ్రామాల్లో గనుక కేసులు నమోదు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన గ్రామాల్లోకి ఏ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news