కడుపులో బిడ్డ తంతోంది అంటూ ఇలియానా బోల్డ్ పోస్ట్..!

-

ప్రముఖ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో దేవదాస్ చిత్రం ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న ఆ తర్వాత అల్లు అర్జున్ , ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు గడించిన ఇలియానా తన అందంతో వొంపు సొంపులతో యువతను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి.

ఇక తను నటనతో, ప్రతిభతో యువతను ఆకట్టుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది .ఇకపోతే తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ కి మకాం మార్చిన ఈమె అక్కడ కొన్ని సినిమాలలో చేసింది. ఆ తర్వాత కరీనాకపూర్ సోదరుడుతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇందులో నిజం తెలియలేదు. కానీ ఉన్నట్టుండి చాలాకాలం తర్వాత తాను తల్లి కాబోతున్నాను అంటూ ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెట్ లో తెగ సందడి చేసింది. తాను తల్లి కాబోతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన ఈమె తన ఇంస్టాగ్రామ్ పేజీలో రెండు బ్లాక్ అండ్ వైట్ ఫోటో లు షేర్ చేసి తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

గతవారం క్రితం లైట్ బేబీ బంప్ తో కనిపించిన ఈమె ఇప్పుడు గర్భంలో బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తన అనుభవాలు, అనుభూతులు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చింది. కునుకు తీయనివ్వడం లేదని నిద్ర కోసం చాలా తంతాలు పడుతున్నానని చెబుతూ మంచంపై లేజీగా పడుకొని ఉన్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తాను మోస్తున్న బిడ్డకి తండ్రి ఎవరు అన్నది మాత్రం చెప్పకుండా దాచేస్తోంది ఈ గోవా బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Latest news