బ్రేకింగ్‌: హీరో నాని ఇల్లు, ఆఫీస్ పై ఐటీ దాడులు.. మ‌హేష్ బాబు, శర్వానంద్ ఇళ్ల‌పై కూడా..?

ఐటీ అధికారులు బుధవారం ఒక్కసారిగా సినీ తారల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్రముఖులే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి పరువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇంట్లో కూడా ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

income tax raids on hero nani and Mahesh babu in hyderabad
income tax raids on hero nani and Mahesh babu in hyderabad

జూబ్లీహిల్స్ లోని ఆయన ఇల్లు,కార్యాలయంలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే మ‌హేష్ బాబు, శర్వానంద్ ఇళ్ల‌పై కూడా ఐటీ దాడులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ గురైంది. కాగా, దాదాపు 10 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు 10చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీనితో పాటు మరికొందరు సినీ ప్రముఖులను కూడా ఐటి లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. సురేష్ బాబు, నానీ ఇళ్లల్లో కీలక పత్రాలు దొరికాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.