‘కార్తీకేయ’ కథ విని భయపడిన హీరో ఇతనే..

-

నిఖిల్ సిద్ధార్థ్ , అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా వచ్చిన ‘కార్తీకేయ-2’ సినిమాను దేశవ్యాప్తంగా ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులతో పాటు సామాన్యులు ప్రతీ ఒక్కరు ఈ సినిమా చూడాలని మెసేజ్ లు ఇస్తున్నారు.

‘కార్తీకేయ’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘కార్తీకేయ-2’ అంచనాలను మించి ఉందని ప్రతీ ఒక్కరు కొనియాడుతున్నారు. కృష్ణతత్వంతో పాటు సైన్స్, మైథాలజీ, హిస్టరీల గురించి దర్శకుడు సినిమాలో చక్కగా చర్చించారని ప్రతీ ఒక్కరు అంటున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమా ద్వారా మరో సూపర్ హిట్ ఫిల్మ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఈ చిత్రం కంటే ముందు వచ్చిన ‘కార్తీకేయ-1’ కూడా ఘన విజయం సాధించింది.

స్నేక్ హిప్నాటిజం, దేవాలయంలో జరిగే అవినీతి గురించి ‘కార్తీకేయ-1’లో దర్శకుడు చందు మొండేటి చర్చించారు. అయితే, ఈ సినిమా స్టోరిని తొలుత తాను హీరో అల్లరి నరేశ్ కు వినిపించానని చందు చెప్పారు. స్టోరి విన్న తర్వాత అల్లరి నరేశ్ కొద్ది రోజుల పాటు భయపడిపోయారని చెప్పారు చందు.

‘కార్తీకేయ’లో స్నేక్ హిప్నాటిజంతో పాటు ఫస్ట్ హాఫ్ మొత్తం పాము కనబడుతుండటం చూసి కొంచెం భయమేస్తుంటుంది. అలా సీన్ టు సీన్ తాను అల్లరి నరేశ్ కు వినిపించిన క్రమంలో బహుశా ఆయన భయపడి ఉండొచ్చని దర్శకుడు చందు మొండేటి తెలిపారు.

‘కార్తీకేయ-2’లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ హైలైట్ గా నిలిచారు. ఆయన పోషించిన ‘ధన్వంతరి వేద్ పాఠక్’ పాత్ర జనాలకు బాగా నచ్చుతోంది. అనుపమ్ ఖేర్ వెండితెరపైన కనబడగానే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘కార్తీకేయ-3’ కూడా ఉండబోతుందనే సంకేతాన్ని దర్శకుడు ‘కార్తీకేయ-2’ ఎండింగ్ లో చూపించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news