తార‌క్ ఆ పాత్ర‌లో గుండుతో క‌నిపిస్తాడా… వామ్మో ఇదేం ట్విస్ట్‌…!

-

రాజమౌళి తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనగానే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సింహాద్రి సినిమాతో రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అభిమానులుగా మారిపోయారు. ఇక తారక్ కూడా ఆయనతో సినిమా అనగానే ప్రత్యేకంగా తీసుకుని ఇతర సినిమాలను పక్కన పెట్టి మరీ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం అదే జరుగుతుంది. యమదొంగ సినిమా కోసం తారక్ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి. తారక్ మరో సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే సమయం మొత్తం కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం బరువు కూడా కొన్ని సందర్భాల్లో పెరగడం మరికొన్ని సందర్భాల్లో తగ్గడం చేస్తున్నాడట తారక్. కొన్ని సన్నివేశాల్లో బరువుగా కనపడే అవకాశం ఉందని అందుకోసం 8 కేజీల వరకు తారక్ బరువు పెరిగారు అనే ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక ట్రైనర్ ని కూడా పెట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు మరో సాహస౦ ఈ సినిమా కోసం చేస్తున్నాడట. కొన్ని యుద్ద సన్నివేశాల్లో గుండు తో కనపడే విధంగా నటిస్తున్నాడట. ఆ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు తారక్ ఫోటో కూడా బయటకు వచ్చే అవకాశం లేదని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమా వ‌చ్చే యేడాది దేశ వ్యాప్తంగానే భారీ అంచ‌నాలు ఉన్న క్రేజీ సినిమాల్లో ఒక‌టిగా నిలుస్తోంది. మ‌రి ఈ అంచ‌నాల‌ను ఆర్ ఆర్ ఆర్ ఎంత వ‌ర‌కు రీచ్ అవుతుందో ? చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news