నిజంగానే బన్నీ సినిమా ఆ ఓల్డ్ క్లాసిక్ కు ఫ్రీమేకా…..??

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాఫై బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఆయన నటించిన డీజే యావరేజ్ గా నిలవగా, గత ఏడాది వచ్చిన నాపేరు సూర్య ఫ్లాప్ గా నిలిచింది. కావున ప్రస్తుతం నటిస్తున్న అలవైకుంఠపురములో సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజెస్ లో ఉంది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా అక్కినేని సుశాంత్,

 

 

ala vaikunta puram lo drops on release date
ala vaikunta puram lo drops on release date

నివేత పేతురాజ్, మురళి శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజలుగా ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, కొన్నేళ్ల క్రితం తెలుగులో తెరకెక్కిన ఇంటి గుట్టు అనే ఓల్డ్ క్లాసిక్ మూవీ స్టోరీ ని బేస్ గా తీసుకుని త్రివిక్రమ్ ఈ సినిమా తీస్తున్నట్లు ఆ వార్త యొక్క సారాంశం. కాగా ఆ వార్త చాలావరకు కరెక్ట్ అని, అంతేకాక ఆ సినిమాలోని కీలక సీన్స్ ని పోలినవి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురములో సినిమాలో కూడా ఉండబోతున్నట్లు సమాచారం. 1958లో విడుదలైన ‘ఇంటిగుట్టు’లో ఎన్టీఆర్‌, సావిత్రి నాయకానాయికలుగా నటించారు. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. అప్పుడది పెద్ద హిట్‌. చిన్నతనంలోనే స్థానాలు మారిన ఇద్దరు పిల్లల కథ అది.

అయితే ఈ వార్త కొన్నాళ్లుగా ప్రచారం అవుతుండడంతో, పూర్తి వివరాలు తెలియకుండా ఈ విధంగా ఒక పెద్ద సినిమాపై తప్పుడు ప్రచారాలు చేయడం తగదని కొందరు సినీ విశ్లేషకులు వీటిని వారిస్తున్నారు. ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే సినిమా యూనిట్ నుండి దీని పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని కూడా వారు అంటున్నారు. మరి ప్రచారం అవుతున్న ఈ పుకార్లకు అడ్డుకట్ట పడాలంటే అలవైకుంఠపురములో టీమ్ దీనిపై స్పందించాల్సిందే అని తెలుస్తోంది……!!

Read more RELATED
Recommended to you

Latest news