బాలయ్య షోకి షర్మిల.. ఆ రహస్యాలు బయట పెట్టబోతోందా..?

నటసింహ బాలకృష్ణ మొదటిసారి పోస్ట్ గా మారి చేస్తున్న తొలి టాక్ షో అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండవ సీజన్ ని కూడా రెడీ చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే రెండవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ కి విశ్వక్ సేన్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యి మరింత పాపులారిటీ చేశారు.

మూడవ ఎపిసోడ్ కి శరవనన్ తో పాటు అడవి శేషు గెస్ట్లుగా రాబోతున్నట్లు అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఫలానా ఎపిసోడ్ కి ఫలానా సెలబ్రిటీ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా బాలయ్య నెక్స్ట్ ఎపిసోడ్ కు అదిరిపోయే గెస్ట్ ఒకరు వస్తున్నారట. ఎవరో కాదు ప్రముఖ రాజకీయ నాయకురాలు వైఎస్సార్ టీపీ అధినేత్రి, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల బాలయ్య షోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షర్మిల బాలయ్య షో కి వస్తున్నారన్న వార్త ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు రేపుతోంది..

ఇటీవల షర్మిల గారు తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా తన అన్నయ్య జగన్ మీద డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ విమర్శలు కూడా చేస్తూ ఉంటుంది. ఇటీవల టిడిపికి అనుకూలంగా ఉండే మీడియా ఛానల్ ఏబీఎన్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పాల్గొన్న షర్మిల ఇప్పుడు మరొకసారి టిడిపి పార్టీ ఎమ్మెల్యే బాలయ్య బాబు నిర్వహిస్తున్న టాక్ షో కి ముఖ్య అతిథిగా పాల్గొనబోతుండడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి షర్మిల షోకి వస్తే ఎలాంటి కామెంట్స్ చేయనుంది.. ఎలాంటి రహస్యాలపై నోరు విప్పనుంది..అనేది ఇప్పుడు రాజకీయ అంశాలపై హాట్ టాపిక్ గా మారింది.