నాగచైతన్య తో శోభిత డేటింగ్ నిజమేనా..?

అక్కినేని నాగచైతన్య తన భార్య సమంతతో విడిపోయిన తర్వాత తన పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల మేజర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాలతో చైతన్య డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలోనే నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారని ఇద్దరూ కూడా తరచూ కలుస్తున్నారనే పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అటు నాగ చైతన్య ఇటు శోభిత ఇద్దరు కూడా స్పందించలేదు. మరొకవైపు వీరిద్దరు ప్రేమాయణం సాగిస్తున్నారు అనడానికి ఒక ఆధారం కూడా లేకపోవడంతో ఇవన్నీ పుకార్లే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా నాగచైతన్య – శోభిత కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వీరిద్దరూ క్యాజువల్ దుస్తుల్లో పక్కపక్కన నిలబడి కనిపించారు.. ఇది చూసిన నెటిజన్ లు వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోందని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఫోటోని మనం చాలా తీక్షనంగా గమనించినట్లయితే అది ఎడిట్ చేసిన పిక్ అని అర్థమవుతోంది. ముఖ్యంగా ఇద్దరిని కట్ చేసి పక్కపక్కన చేర్చినట్లు స్పష్టం అవుతోంది. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ చూస్తే మాత్రం ఇద్దరూ ఒకే ప్లేస్ లో దిగిన ఫోటోలా కనిపిస్తోందని పలువురు నెటిజన్లు కూడా తమ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై వీరు స్వయంగా మాట్లాడితే తప్ప నిర్ధారణకు రాలేమని తెలుస్తోంది. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో చైతన్య ను శోభిత దూళిపాళ్ల గురించి చెప్పగానే ఏం గుర్తొస్తుంది ?అని అడగ్గా చిన్న స్మైల్ ఇచ్చారు. జస్ట్ నవ్వుతానని మాత్రమే బదులిచ్చారు. దీంతో పరోక్షంగా వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ కన్ఫర్మ్ అయ్యాయి అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.