శాకుంతలం సినిమా కోసం సమంత ధరించిన నగల విలువ అన్ని కోట్లా..?

-

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ , మలయాళం భాషల్లో సమంత నటించిన శాకుంతలం సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాలిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. సమంత మొదటిసారి నటిస్తున్న పౌరాణిక ప్రేమకావ్యం కూడా ఇదే. శాకుంతలం సినిమాను విజువల్ వండర్ తో పాన్ ఇండియాగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతూ ఉండడం గమనార్హం. అందులో భాగంగానే సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇందులో స్టార్ హీరో మోహన్ బాబు, మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్ , గౌతమి, సచిన్ కేడ్కర్, మధుబాల, కబీర్ బేడి, ప్రకాష్ రాజ్, అతిధి బాలన్, అనన్య నాగళ్ళ, వర్షిని సౌందర్య రాజన్ వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా భరతుడి పాత్రలో ఇండస్ట్రీ ప్రవేశం చేసింది. ఇదిలా ఉండగా తాజాగా శాకుంతలం సినిమా నుంచి సమంత గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు రాగా ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో ఈ విషయం కాస్త చెక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో సమంత ధరించిన చీర , నగలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారాయి. సమంత క్యారెక్టర్ కోసం హైదరాబాద్ కి చెందిన వసుంధర డైమండ్స్ వారు ప్రత్యేకంగా ఈ నగలను డిజైన్ చేశారట. ఈమె ధరించిన నగల ధర ఏకంగా రూ. 93 కోట్లు అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం ఆమె 30 కేజీల బరువు ఉండే చీరను కట్టుకుందని, ఆ చీరతో దాదాపు 7 రోజులపాటు షూట్ చేశారని సమాచారం. ఏదేమైనా సమంత ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో డెడికేటెడ్ గా వర్క్ చేస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news