పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి చూపెట్టిందట.. ఊర మాస్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్

-

తెలంగాణ యాసతో, భాషతో ఇదివరకు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ.. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ట్రైలర్ మాత్రం సరికొత్తగా ఉంది. పూర్తిగా హైదరాబాద్ యాసలో ఈ సినిమా ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ను చూస్తే పూరీ మార్క్ ఖచ్చితంగా కనబడుతోంది. సినిమా మొత్తం హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుంది.

ఇక సినిమాలో రామ్ డైలాగులు మాత్రం అదిరిపోయాయి. అచ్చం హైదరాబాద్ యువకులు మాట్లాడే యాసలా ఉంది. రామ్ యాస మాత్రమే కాదు.. ఆయన వేషధారణ కూడా చిత్రంగా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే ఊర మాస్ లుక్ తో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన… నిధి అగర్వాల్, నభా నటాష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 18 న ఈ సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news