వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని అందరూ ఊహించిందే. కానీ.. ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడు అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ.. ఆయన వరల్డ్ కప్ అయిపోగానే రిటైర్ అవుతున్నాడట. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ వీడ్కోలు పలకనున్నాడట.
ఏంటో… ఈ సంవత్సరం క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ లనే తీసుకొస్తోంది. ఇప్పటికే యువరాజ్ సింగ్, అంబటి రాయుడు తమ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో బ్యాడ్ న్యూస్ ను క్రికెట్ అభిమానులు వినాల్సి వస్తోంది. 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ భారత్ కు రావడంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎంఎస్ ధోనీ కూడా త్వరలోనే రిటైర్ అవబోతున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని అందరూ ఊహించిందే. కానీ.. ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడు అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ.. ఆయన వరల్డ్ కప్ అయిపోగానే రిటైర్ అవుతున్నాడట. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ వీడ్కోలు పలకనున్నాడట.
అంటే… అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ఈ వరల్డ్ కప్ మ్యాచులే ధోనీ చివరి మ్యాచులు. ఒకవేళ ఇండియా ఫైనల్ కు అర్హత సాధిస్తే… ఈనెల 14న లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచే ధోనీ చివరి మ్యాచ్ కానుంది. ఒకవేళ భారత్ ఈసారి కూడా ప్రపంచ కప్ సాధిస్తే.. ధోనీకి ఇది ఘనమైన వీడ్కోలు కానుంది. అందుకే.. వరల్డ్ కప్ లో విజయం సాధించి… అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని ధోనీ భావిస్తున్నాడట. తన రిటైర్మెంట్ కు సంబంధించి ఇప్పటికే బీసీసీఐకి ధోనీ సమాచారం ఇచ్చాడట.
మరోవైపు ధోనీ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఆయన మీద ట్రోలింగ్స్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచ కప్ లోనూ ఆయన ఆట తీరు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ఈ వరల్డ్ కప్ అయిపోగానే… క్రికెట్ ను వీడాలని భావిస్తున్నాడట. దానితో పాటు.. వయసు కూడా మీద పడటంతో ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిందేనని ధోనీ అనుకున్నాడట.
ఇక.. ధోనీ భారత్ కు అందించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భారత్ కు ఎన్నో విజయాలను అందించాడు. ఐసీసీ టోర్నమెంట్లు అన్నింటినీ అందించిన ఏకైక భారత కెప్టెన్ ధోనీయే. 2007 ఐసీసీ టీ20 వరల్డ్ కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ను భారత్ కు అందించి… క్రికెట్ రంగంలోనే భారత్ ను ధోనీ ఎక్కడికో తీసుకుపోయాడు.