ఇకపై బిగ్ బాస్ 6 నుంచి లీక్ అసాధ్యం..!!

ఇండస్ట్రీ హిస్టరీ లోనే బిగ్ బాస్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో బిగ్ బాస్ యొక్క సెట్ నిర్మాణం పై నిర్వాహకులు కూడా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలోనే ఈసారి కూడా బిగ్ బాస్ కొత్త సీజన్ జరగబోతోంది అని గతంలో లాగా కాకుండా ఈసారి సెట్ ను విభిన్నంగా చూపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా బిగ్బాస్ గత సీజన్లలో ఎదుర్కొన్న లీకులకు కూడా చెక్ పెట్టే ఉద్దేశంతోనే నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ షూట్ కు హాజరైన టెక్నీషియన్స్ ఇతర టీం వల్ల లీక్ అవుతున్నాయి. అందుకే శనివారం ఎపిసోడ్ చిత్రీకరణ జరిగే సమయంలో అత్యంత సెక్యూరిటీని ఏర్పాటు చేయబోతున్నారట నిర్వాహకులు.

షూటింగ్ కి హాజరైన ప్రతి ఒక్కరు కూడా లోపలే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. తద్వారా ఎలిమినేషన్ ఎవరు అయ్యారు.. సోమవారం నాటి ఎపిసోడ్ లో ఎవరు నామినేట్ అవ్వబోతున్నారు అనే విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇలా అన్ని విషయాలు బిగ్ బాస్ కు సంబంధించి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్లో ఎలాంటి లీక్ లకు చోటు లేకుండా స్టార్ మా వర్గాలు బలంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ప్రతి సీజన్లో ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సీజన్ ఎప్పటిలాగే మంచి రేటింగ్ ను దక్కించుకుంటుందని వారు వ్యక్తం చేశారు. ఇకపోతే మొన్నటివరకు ఓటీటీ లో స్క్రీనింగ్ అయినా బిగ్ బాస్ నాన్ స్టాప్ కి కూడా మంచి టిఆర్పి రేటింగ్ లభించింది. అందుకే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించే అవకాశం ఉందని సమాచారం.