హీరో నాని కి తృటిలొ తప్పిన ప్రమాదం?

న్యాచురల్ స్టార్ నాని.. చూడ‌డానికి ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే ఈ యంగ్ హీరో.. విన్నూత‌మైన‌.. విభిన్న‌మైన పాత్ర‌లు, సోర్టీలు చేస్తూ.. అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో నానికి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఇక ప్రస్తుతం హీరో నాని 29వ సినిమాకు రెడీ అవుతున్నారు. మొన్నటి దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేశాడు. “ద‌స‌రా” అనే టైటిల్‌తో నాని 29వ మూవీ తెర‌కెక్క‌బోతుంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ గోదావరిఖనిలో జరుగుతున్న విషయం తెలిసిందే.నాచురల్ స్టార్ నాని ఈ చిత్రం షూటింగులో ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఓ బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా.. బొగ్గంత అతడి పై పడినట్లు సమాచారం.అయితే అదృష్టవశాత్తు నానికి గాయాలు ఏమీ కాలేదట.దీంతో కాసేపు షూటింగ్ నిలిపివేశారని..నాని పూర్తిగా సిద్ధం అయ్యాకే షూటింగ్ ని మళ్లీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.