Itlu Maredumilli Prajaneekam : “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” నుంచి లచ్చిమి సాంగ్‌

-

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. లచ్చిమి ..మీ యనక యనక వస్తాగనక అంటూ సాగే ఈ సాంగ్‌ ప్రోమో ను రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ లో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ అదిరిపోయాయి. రేపు సాయంత్రం 5.05 గంటలకు ఫుల్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేయనుంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news