జాన్వీ సోకుల విందు.. చాలా బొద్దుగా కనిపిస్తూ..రచ్చ చేస్తుందిగా!

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్…బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తండ్రి బోనీ కపూర్ సూచనలతో కెరీర్ లో ముందుకు సాగుతున్నది.

అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ సుందరి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటుంది.

‘ధడక్’ సినిమాతో బీ టౌన్‌లో అడుగుపెట్టిన ఈ సుందరి మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంది.

కార్గిల్ గర్ల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘గుంజన్ సక్సేనా’ ఫిల్మ్ లో పైలట్‌గాను తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.