‘వినయ విధేయ రామ’ తరువాత బోయపాటి శ్రీను ఒక పవర్ఫుల్ కథపై కసరత్తు చేస్తూ ఉన్నాడు. మరి మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేయగల సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా రానుంది. అయితే ఈ నెలలోనే బాలకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పవర్ఫుల్ పాత్రలో రోజా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా పాత్రల ఎంపికపై బోయపాటి దృష్టిపెట్టినట్టుగా చెబుతున్నారు.
ఈ సినిమాలో కామెడీకి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం రెగ్యులర్ కమెడియన్స్‌కు బదులుగా ‘జబర్దస్త్’ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి వున్నాడని అంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. కాగా, గతంలో బోయపాటి దర్శకత్వంలో ఇప్పటికే బాలయ్య సింహా మరియు లెజెండ్ చిత్రాలు చేశాడు. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.