జబర్దస్త్​ రోహిణి తండ్రికి అదిరిపోయే గిఫ్ట్​.. ఏంటో తెలుసా?

జబర్దస్త్​ రోహిణి.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. ఎందుకంటే అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్విస్తుంటుంది ఈ బుల్లితెర లేడీ కమెడియన్.​ వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న ఈ జబర్దస్త్ అమ్మడును రౌడీ రోహిణి అని కూడా అంటారు. తెలుగు సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రోహిణి.. బిగ్ బాస్, జబర్దస్త్ షోస్ ద్వారా మరింత దగ్గరైంది. కామెడీ పంచులతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు కామెడీ షోస్ చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్​తో ఆకట్టుకుంటున్న రోహిణి.. ఎక్కడుంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. అలా మంచి ఫాలోయింగ్​ను సంపాదించుకుంది.

ప్రస్తుతం జబర్దస్త్ షోలు, సీరియల్స్, స్పెషల్ ఈవెంట్​లు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్న ఈమె రౌడీ రోహిణి పేరుతో ఉన్న ఓ యూట్యూబ్ ఛానల్​ ద్వారా అలరిస్తోంది. రకరకాల వీడియోలతో ఆడియన్స్​ను ఎంటర్టైన్ చేస్తున్న ఆమె తాజాగా ఓ వీడియోను అప్లోడ్​ చేసింది. అందులో ఆమె.. తన తండ్రికి అదిరిపోయే బహుమతి ఇచ్చి సర్​ప్రైజ్​ చేసింది. తన తండ్రికి ఒక కొత్త బైక్​ను కొనిచ్చింది. ఆమె తండ్రికి ఒక బైక్ మీద తిరగాలన్న కోరిక ఉందట. ఎప్పుడో మాటల్లో రోహిణికి చెప్పారట. ఇప్పుడా తండ్రి కోరికను ఆమె తీర్చింది. తమ్ముడితో కలిసి షోరూంకు వెళ్లి.. ఓ బైక్​ను కొనుగోలు చేసింది.

అనంతరం ఇంటికి తీసుకొచ్చి.. తండ్రిని పిలిచింది. ఆ బైక్​ను చూసిన ఆమె తండ్రి సంతోషంతో మురిసిపోయారు. అలానే ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఆయన రోహిణిని ఎక్కించుకుని బైక్ మీద అలా ఒక రౌండ్ వేసి సంతోషపడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.