గతంలో పలు చిత్రాలలో హీరోగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు జేడి చక్రవర్తి ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఉన్నారు. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సక్సెస్ అయ్యేందుకు పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా దయ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జె.డి చక్రవర్తి.. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ నటుడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
గతంలో యాంకర్ , యాక్టర్ విష్ణు ప్రియ ఒక టాక్ షోలో జెడి చక్రవర్తిని ప్రేమిస్తున్నానంటూ అతను ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానంటూ కామెంట్లు చేసింది.. ఇదే విషయాన్ని జెడి చక్రవర్తిని అడగగా.. జెడి చక్రవర్తి ఇలా మాట్లాడుతూ విష్ణు ప్రియ తాను కలసి దయ అనే వెబ్ సిరీస్లో నటించాము. ఆ వెబ్ సిరీస్ షూటింగ్లో విష్ణు ప్రియ తనకి రిలేషన్ ఏర్పడిందని.. అయితే అందరూ అనుకునే టైపు కాదు కానీ కేవలం గురు శిష్యుల మధ్య బంధం అని జెడి చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జెడి చక్రవర్తి విష్ణుప్రియ పైన ఎలాంటి క్రష్ లేదని విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది.
గతంలో జెడి చక్రవర్తి ఒక హీరోయిన్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్య తనపైన విష ప్రయోగం చేసిందని విషయాన్ని తెలియజేయడం జరిగింది..ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని తెలియజేశారు జెడి చక్రవర్తి. ప్రస్తుతం జె డి చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.