థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జేడీ చక్రవర్తి..!

-

విలక్షణ నటుడిగా.. విలన్ గా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాతో తన సినిమా కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత అంచెలంచలుగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. విభిన్నమైన పాత్రలు పోషించి యువతలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన జె.డి చక్రవర్తి మనీ, వన్ బై టు ,రక్షణ, గులాబీ, ఎగిరే పావురమా, అనగనగా ఒక రోజు, బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా, సత్య వంటి సినిమాలతో తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.

ఒకానొక సమయంలో హీరోగా ఒక ట్రెండు సెట్ చేసిన ఆయన తాజాగా దయ అనే ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక తాజాగా దయ వెబ్ సిరీస్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లో జెడి చాలా డీప్ గా ఆలోచిస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఈ టైటిల్ కి ఫీల్ ది రేజ్ అనేది ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రేమ ఇష్క్ కాదల్ ,సావిత్రి, సేనాపతి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ చాలా బాగా వచ్చిందని.. ఎడిటింగ్ , మేకింగ్ పరంగా తెలుగు వెబ్ సిరీస్ లో ఇదొక ట్రెండ్ సెట్టర్ గా మారబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఎవరు తీసుకోని ఒక కొత్త పాయింట్ తో జెడి చక్రవర్తి మన ముందుకు రాబోతున్నారని.. ఆద్యంతం ఈ చిత్రం థ్రిల్లింగ్ గా ఆకట్టుకుంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news