సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జాన్వి డ్యాన్స్ (వీడియో)

-

శ్రీదేవి తనయ జాన్వి కపూర్ లాస్ట్ ఇయర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దఢక్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన జాన్వి ప్రస్తుతం తన సెకండ్ ప్రాజెక్ట్ పై గురి పెట్టింది. శ్రీదేవి వారసురాలిగా అందం అభినయంతో అదరగొట్టేందుకు రెడీ అయిన జాన్వి కపూర్ మొదటి సినిమాలో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. అసలు జాన్వికి డ్యాన్స్ లో ప్రావీణ్యం ఉందా లేదా అన్నది డౌట్ మొదలైంది.

అయితే అలాంటి వారికి షాక్ ఇస్తూ తన డ్యాన్స్ రిహార్సెల్ వీడియోతో సర్ ప్రైజ్ చేసింది జాన్వి కపూర్. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో డ్యాన్స్ చేసేందుకు రిహార్సెల్స్ చేస్తున్న జాన్వి కపూర్ క్రేజీ మూమెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వేల కొద్ది షేర్లు.. వందల కొద్ది లైకులు ఈ వీడియోకి పడుతున్నాయి. జాన్వి డ్యాన్స్ వీడియోని బాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. జాన్వి జోరు చూస్తుంటే బాలీవుడ్ లో ఓ ఊపు ఊపేయడం ఖాయమని తెలుస్తుంది.

కేవలం బాలీవుడ్ లోనే కాదు సౌత్ సినిమాల మీద జాన్వి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. శ్రీదేవి లానే తెలుగులో కూడా నటించేందుకు తాను రెడీ అంటున్న జాన్వి కపూర్ మంచి ఆ అవకాశం ఎదురుచూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news