నాగబాబు మళ్ళీ మొదలుపెట్టాడు.. ఈసారి బాల‌య్య‌ అల్లుడితో..!

-

మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారు. బాలకృష్ణ మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ కామెంట్స్ తో నిన్న మొన్నటి నానా హంగామా సృష్టించిన నాగబాబు లేటెస్ట్ గా ఓ వీడియోతో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈసారి కేవలం తాను సరదాగా నవ్వుకోడానికి చేస్తున్న వీడియోలే తప్ప ఎవరిని విమర్శించడానికి కాదని చెప్పాడు.

అలా చెబుతూనే నారా లోకేష్ గురించి ప్రస్థావించి షాక్ ఇచ్చాడు నాగబాబు. ఓ పక్క పవన్ జనసేన ఈసారి కూడా ఏపిలో టిడిపి సపోర్ట్ గా ఉంటుందని వార్తలు వస్తుండగా వాటిని ఖండించే ప్రయత్నంగా చినబాబు మీద సిల్లీ కామెంట్ చేశాడు నాగబాబు. లోకేష్ చిన్నపిల్లాడు అంటూ అతను మాట్లాడింది అక్షరాల నిజమని టిడిపిపై తన వివక్ష చూపించాడు నాగబాబు.

అయితే తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టే వీడియోలు కేవలం నా వ్యక్తిగతం అని.. ఇది ఎవరి కోసం కాదని తేల్చి చెప్పాడు నాగబాబు. అయితే నాగబాబు కామెంట్స్ పై నెటిజెన్లు మాత్రం మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news