తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ ఒక సంచలనం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు. వరుస హిట్లను అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. పౌరాణిక, సాంఘీక, జానపద పాత్రలు ఏదైనా.. అవలీలగా నవరసాలను పండించగల నైపుణ్యమే ఆయన్ను విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిని చేసింది.
అయితే ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఆయన ప్రతి విషయంలోనూ క్రమశిక్షణతో ఉండేవారు. అంతే కాకుండా తాను కష్టపడి సంపాదించిన డబ్బును అవసరం అయితే ఖర్చు చేసేవారు. తనది కాని డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడేవారు కాదట. మరోవైపు స్టార్ స్టేటస్ వచ్చినా, అడిగితే నిర్మాతలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్టీఆర్ మాత్రం డిమాండ్ చేసేవారు కాదట.
నిర్మాతలకు కూడా గిట్టుబాటు అవ్వాలి కదా అని చెప్పేవారట. తన సినిమాల్లోని నటులు ఎక్కువ పుచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రమే ఆశించేవారట. ఇక తాజాగా ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా పాతాల భైరవి రెమ్యునరేషన్ వైరల్ అవుతోంది.
1951 లో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రతి రోజూ కర్రసామును నేర్చుకునేవారు. అప్పుడు ప్రతి రోజు ఎన్టీఆర్‌కు స్టూడియోలోనే ఇడ్లీలు, వడ టిఫిన్‌గా పెట్టేవారట. అంతే కాకుండా నెలకు రూ.250 రూపాయలు రెమ్యునరేషన్ ఆయన తీసుకునేవారట. అయితే ఆ రోజులలో ఎన్టీఆర్ పుచ్చుకున్న రెమ్యునరేషన్ ఎక్కువనే చెప్పాలి.