కంటతడి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ జయంతినే టీడీపీ మరిచిపోయిందా?

-

నిజానికి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్థంతిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధికారికంగా జరుపుతుంటుంది. ఆయన జయంతి, వర్థంతికి ఒకరోజు ముందే.. ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరిస్తారు. కానీ.. ఈసారి మాత్రం టీడీపీ ఎన్టీఆర్ జయంతిని పట్టించుకోలేదు. ఆ విషయంపైనే ఇప్పుడు పెద్దగా చర్చ నడుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్.. ఇవాళ ఉదయమే తన తాత సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకున్నారు. ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ జయంతి కదా. నక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు ఉదయం 5.30కే చేరుకున్నాడు. తన సోదరుడు కల్యాణ్ రామ్ తో సహా అక్కడికి చేరుకున్న జూ. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ సమాధిని చూసి కంటతడి పెట్టుకున్నాడు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి. జయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్ వెలవెలబోవడాన్న చూసి జూనియర్ తట్టుకోలేకపోయాడట. వెంటనే కళ్ల వెంట కన్నీళ్లు వచ్చాయట. తన తాతకు ఈ దుస్థితి పడటమేంటని చాలా బాధ పడ్డాడట.

Junior NTR expresses grief at ntr ghat over graveyard decoration

నిజానికి ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్థంతిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధికారికంగా జరుపుతుంటుంది. ఆయన జయంతి, వర్థంతికి ఒకరోజు ముందే.. ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరిస్తారు. కానీ.. ఈసారి మాత్రం టీడీపీ ఎన్టీఆర్ జయంతిని పట్టించుకోలేదు. ఆ విషయంపైనే ఇప్పుడు పెద్దగా చర్చ నడుస్తోంది.

ఇటీవల ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ.. చివరకు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను కూడా మరిచిపోయిందా? ఆయన జయంతి రోజు పార్టీ తరుపున ఘాట్ వద్ద నివాళులర్పించాలన్న ఇంగితం కూడా పార్టీకి లేదా? పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు కర్తవ్యం కాదా? అంటూ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు.. ఇలా ఎన్టీఆర్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించకుండా వదిలేయడం టీడీపీ పార్టీకే మాయని మచ్చ అని విశ్లేషకులు అంటున్నారు.

తన తాతను ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా బాధ పడ్డ ఎన్టీఆర్.. ఇప్పటి నుంచి తాత జయంతి, వర్థంతిని తానే దగ్గరుండి జరుపుతానని అక్కడ ప్రకటించారు. వెంటనే తానే పూలను తెప్పించి సమాధిని అలంకరించి.. ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం కాసేపు తాత సమాధి పక్కన మౌనంగా కూర్చున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news