టెన్త్ క్లాస్‌లో ల‌వ్ ఏంట్రా.. మైండ్ దొబ్బిందా..?

-

అప్పుడెప్పుడో ఉషా కిర‌ణ్ మూవీస్ ఆధ్వ‌ర్యంలో ఓ సినిమా వ‌చ్చింది గుర్తుంది క‌దా.. చిత్రం అని.. ఆ త‌రువాత అడ‌పా ద‌డ‌పా టీనేజ్ ల‌వ్‌పై సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇటీవ‌లే బాయ్ అనే ఓ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను కూడా యూట్యూబ్ లో విడుద‌ల చేశారు.

తెలుగు సినీ ద‌ర్శ‌క నిర్మాతలు కొంద‌రికి అప్పుడ‌ప్పుడూ ఏదో జాడ్యం వ‌స్తుంటుంది కాబోలు.. తీస్తే సాధార‌ణ సినీ ప్రేక్ష‌కులు చూడ‌లేని అస‌భ్యకర సీన్లు, డైలాగ్‌ల‌తో సినిమాలు తీస్తారు. లేదంటే.. 10వ త‌ర‌గ‌తిలోనే ల‌వ్‌.. అంటూ టీనేజ్ ల‌వ్ పేరిట వెండి తెర‌పై వికృతాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. అవును నిజ‌మే. ల‌వ్ అనేది ఒక అద్భుత‌మైన విష‌యం. ఏ వ‌య‌స్సులో ఉన్న వారైనా, ఎవ‌ర్న‌యినా ప్రేమించ‌వ‌చ్చు. ప్రేమ‌ను పొంద‌వ‌చ్చు. క‌రెక్టే… కానీ యుక్త వ‌య‌స్సు రాకుండానే మ‌రీ పిల్ల‌త‌నంలోనే ప్రేమ అంటే.. అది నిజ‌మేనా..? అస‌లా వ‌య‌స్సులో ప్రేమ క‌రెక్టేనా..? ఇది స‌మాజంలో ఎంత వ‌ర‌కు స‌మ్మ‌తం..? ఎంద‌రు దీనికి మ‌ద్ద‌తు ప‌లుకుతారు..?

అప్పుడెప్పుడో ఉషా కిర‌ణ్ మూవీస్ ఆధ్వ‌ర్యంలో ఓ సినిమా వ‌చ్చింది గుర్తుంది క‌దా.. ”చిత్రం” అని.. ఆ త‌రువాత అడ‌పా ద‌డ‌పా టీనేజ్ ల‌వ్‌పై సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇటీవ‌లే ”బాయ్” అనే ఓ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను కూడా యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. అందులో టెన్త్ క్లాస్ ల‌వ్ అనే క‌థాంశం ఉంటుంద‌ని మ‌న‌కు ట్రైల‌ర్ చైస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అలాగే ఇంకా ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఇదివ‌ర‌కే.. టెన్త్ లేదా ఇంట‌ర్‌లోనే ప్రేమ అంటూ.. క‌థాంశాల‌ను ఎంచుకుని సినిమాల‌ను తీసి యూత్ పైకి వ‌దిలారు. ఈ క్ర‌మంలో అలాంటి సినిమాల‌ను కొంద‌రు యువ‌త ప్రేర‌ణ‌గా తీసుకుని చేయ‌కూడ‌ని త‌ప్పులు చేస్తున్నారు. దీంతోపాటు అలాంటి సినిమాల వ‌ల్ల యువ‌త పెడ‌దారిన కూడా ప‌డుతోంది.

యుక్త వ‌యస్సులో ఉన్న‌వారే ప్రేమ విష‌యంలో కొన్నిసార్లు పొరపాటు ప‌డి మోస‌పోతుంటారు. అలాంటిది వ‌య‌స్సు ప‌రంగా అంత‌గా ప‌రిప‌క్వ‌త లేని వారు ఎదుటి వారిని చూసి ఇష్ట‌ప‌డితే దాన్ని ప్రేమ అంటారా..? అది ఎంత కాలం ఉంటుంది..? అస‌ల‌ది ప్రేమా..? లేక వ్యామోహ‌మా..? అది ఎక్క‌డికి దారి తీస్తుంది..? ఎంత మంది త‌ల్లిదండ్రులు ఇలాంటి ప్రేమ‌ల‌ను ఒప్పుకుంటారు..? అంటే.. సందేహ‌మే.. అస‌లు ఇలాంటి ప్రేమ‌ల‌ను ఏ త‌ల్లిదండ్రీ అంగీక‌రించ‌రు. ఇక‌ డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా సినిమాలు తీసే కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మాత్రం సామాజిక బాధ్య‌త అస్స‌లు ప‌ట్ట‌దు. టెన్త్ ల‌వ్‌, ఇంట‌ర్ ల‌వ్.. అంటూ.. సినిమాలు తీసి వ‌దులుతారు. దీంతో చివ‌రికి యూతే బ‌ల‌వుతారు. మ‌రి ఇక‌నైనా ఇలాంటి సినిమాలు తీసే ద‌ర్శ‌క నిర్మాతల ధోర‌ణిలో మార్పు వ‌స్తుందా.. అంటే అందుకు కాల‌మే స‌మాధానం చెప్పాలి..!

Read more RELATED
Recommended to you

Latest news