జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతి

ఏపీ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతిచెందాడు. ప్రమాదం జరిగి జనార్ధన్ కోమాలో ఉండగా.. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అభిమాని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. జనార్ధన్ తల్లితో మాట్లాడి ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. జనార్ధన్ తల్లితో మాట్లాడిన తర్వాత కోమాలో ఉన్న జనార్దన్ దగ్గర ఎన్టీఆర్ మాట్లాడుతున్న ఫోన్ పెట్టారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ జనార్ధన్ కి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

నేను ఉన్నాను.. నువ్వు త్వరగా కోలుకుంటే మనం కలుద్దాం అంటూ అతనికి జీవితం మీద ఆశ కల్పించే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్. జనార్ధన్ కోలుకోవాలని ఎన్టీఆర్ తో పాటు అతని అభిమానులు ఎంతగానో ప్రారంభించినప్పటికీ జనార్దన్ ప్రాణాలు దక్కలేదు. మంగళవారం సాయంత్రం జనార్ధన్ తుది శ్వాస విడిచాడు.