జ్యోతిక సినిమా ఓటిటిలో వచ్చేసింది ..ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా ..?

-

కోలీవుడ్ లో నానా హంగామా సృష్ఠించిన సినిమా “పొన్ మగల్ వందాల్”. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నిర్మాణంలో తన భార్య జ్యోతిక నటించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. అంతేకాదు ఈ సంఘటన తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా విషయంలో సూర్య కి థియోటర్స్ సంఘాల వాళ్ళకి మద్య పెద్ద వారే జరిగింది. అయిన సూర్య ఎవరినీ లెక్క చేయకుండా తను అనుకున్నట్టుగానే అమేజాన్ ప్రైంలో నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

 

2డి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య నిర్మించడం.. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు ‘పొన్ మగల్ వందాల్’ ఆన్ లైన్లో రిలీజైపోయింది. ఈ నేపథ్యంలో సమీక్షకులతో పాటు సామాన్య ప్రేక్షకులూ సినిమా చూసి రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ‘పొన్ మగల్ వందాల్’ బావుందంటూ చెప్పుకుంటున్నారు. అయితే మహా అద్భుతమైన సినిమా మాత్రం కాదు అన్న టాక్ కూడా ఉందట.

ఈ సినిమా కి ఫిలిం సెలబ్రెటీలు పీఆర్వోలు సూపర్బ్ అంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. అయితే కొందరు సమీక్షకులు.. ప్రేక్షకులు మాత్రం సినిమా పర్వాలేదని అంటున్నారు. కథాంశం హార్డ్ టచింగ్ ఉన్నప్పటికి అక్కడక్కడా చిన్న చిన్న మైనస్ లు ఉన్నాయని అంటున్నారట. అయితే ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలలో మాత్రం సినిమా కి పాజిటివ్ టాక్ వస్తుందట. ఇక ఈ సినిమా సామాజిక అంశంతో తెరకెక్కించారు. సినిమా మొత్తాని జ్యోతిక భుజాన మోసిందని అంటున్నారు. మరి మరో రెండు రోజులు ఆగితే ఫీడ్ బ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి సూర్య తన పంథం నెగ్గించుకోవడమే కాదు సినిమా విషయం లో కూడా సక్సస్ అయ్యాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news