పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..! వీడియో

-

దశాబ్ధ కాలం నుండి హీరోయిన్ గా ఆడియెన్స్ ను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది. వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని ఆమె సొంతం అనేలా అప్పుడప్పుడు అదరగొట్టే ఫోటో షూట్స్ తో దుమ్ముదులిపేస్తుంది. రెండేళ్ల క్రితం కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించిన అమ్మడు మళ్లీ వరుస అవకాశాలతో హుశారందుకుంది.

ఓ పక్క సినిమాలు చేస్తూ ఫోటో షూట్స్ చేయడం హీరోయిన్స్ కు కొత్తేమి కాదు. అందులో భాగంగానే కాజల్ లేటెస్ట్ గా ఓ క్రేజీ ఫోటో షూట్ తన ఫ్యాన్స్ ను ముక్కున వేలేసుకునేలా చేసింది. పాలరాతి శిల్పం లాంటి అందంతో కాజల్ ఫోటో షూట్ చూసిన ఎవరైనా పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా అంటూ పాటేసుకోవాల్సిందే. తన అందాల మత్తులో ఆడియెన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కాజల్ చూస్తుంటే మరో ఐదేళ్లు ఇదే ఫాంతో కెరియర్ కొనసాగించేలా ఉంది.

ఈమధ్య బెల్లంకొండ బాబుతో కాస్త క్లోజ్ గా ఉంది అన్న వార్తలు రాగా అదే హీరోతో సీత సినిమాలో నటిస్తుంది కాజల్. తేజ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది కాజల్.

Read more RELATED
Recommended to you

Latest news