బాలయ్య తో సినిమా కి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న కాజల్..!

-

తెలుగు తెరపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడినీ వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కాజల అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలతో బిజీగా అవుతున్నది.ఇటీవల ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నది. అదే విధంగా చంద్రముఖి-2 లో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదంతా ఇలా ఉండగా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలయ్య హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్త గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు.. బాలయ్య కూడా వీరసింహారెడ్డి సినిమాతో సక్సెస్ నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.

ఇక బాలయ్య ఇందులో కూడా ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కాజల్ నటించడం కోసం ఏకంగా రూ.4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం ఏమి అడిగినంత ఇవ్వడానికి కూడా మేకర్స్ ఇటీవల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాజల్ అగర్వాల్ గురించి వస్తున్న ఈ వార్తలపై ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news