మహేష్ బాబుకి ఝలక్ ఇచ్చిన కన్నడ స్టార్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి తర్వాత అసలైతే సుకుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. సుకుమార్ ప్లేస్ లో అనీల్ రావిపుడి వచ్చి చేరాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి మహేష్ కోసం కూడా అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర, ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి నటిస్తారని అన్నారు.

కన్నడ సినిమాతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న ఉపేంద్ర అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. అయితే మహేష్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా ఉపేంద్రకు డేట్స్ అడ్జెస్ట్ కాక చేయలేనని చెప్పారట. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రస్థావిస్తూ మహేష్ తో నటించే అవకాశం వచ్చింది కాని కుదరలేదు. వాళ్లు అడిగిన డేట్స్ వేరే సినిమాకు ఆల్రెడీ కేటాయించానని చెప్పారు. అయితే ఇప్పుడు కుదరకపోయినా ఫ్యూచర్ లో మహేష్ తో నటించేందుకు సిద్ధమే అన్నారు ఉపేంద్ర. కన్నడ నుండి వచ్చిన ఉపేంద్ర సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి.. ఏ, ఉపేంద్ర లాంటి సినిమాలు తెలుగులో కూడా ఉపేంద్రకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Read more RELATED
Recommended to you

Latest news