భారతదేశ ప్రజలు మొత్తం ప్రస్తుతం ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమానే ది కాశ్మీర్ ఫైల్స్. మార్చి 11న తక్కువ థీయేటర్స్ లలో విడుదల అయి.. ప్రజల డిమాండ్ తో థీయేటర్ల సంఖ్య పెంచుకుంది. ఈ చిన్న సినిమా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదరించడంతో పెద్ద హిట్ ను అందుకుంది. విడుదల అయిన కేవలం 6 రోజుల్లోనే 76 కోట్ల కలెక్షన్లను కూడా సాధించింది. అతి కొద్ది రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరబోతుంది.
కాగ ఈ సినిమా గురించి మన దేశంలోనే కాకుండా అమెరికాలోనే చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మన దేశంలో సృష్టిస్తున్న రికార్డులకు తోడుగా మరో అరుదైన ఘనతను అందుకుంది. అమెరికా దేశంలోని అమెరికా స్టేట్ ఆఫ్ రోడ్ ఐలాండ్స్ ఈ సినిమాకు ఒక సెర్టిఫికెట్ ను ప్రదానం చేసింది.
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసి.. ఈ సినిమా ముఖ్య ఉద్ధేశ్యాన్ని గుర్తించి ఈ సెర్టిఫికెట్ ను అందించారు. కాగ ఈ సినిమాకు వచ్చిన సెర్టిఫికెట్ ను డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కాగ ది కాశ్మీర్ ఫైల్స్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడంతో చిత్ర బృందంతో పాటు సినిమా ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.