గిన్నెలు తోముకున్న మల్లీశ్వరి…అంతా కరోనా ఎఫెక్టే

48

కరోనా ఈ పేరు చెప్పగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఈ కరోనా ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు తమదైన శైలి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కరోనా మృతుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీనితో ప్రపంచ దేశాలు చాలా వరకు లాక్ డౌన్ ను కూడా ప్రకటించారు. భారత్ లో కూడా ఈ కరోనా మహమ్మారి బాగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలు నా నా ఇబ్బందులు పడుతూ ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే లాక్ డౌన్ తో సినీ సెలబ్రిటీ లు సైతం ఇళ్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు అందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూ ఇంటి పనుల్లో సాయం చేస్తున్నారు కూడా. అందుకే బాలీవుడ్ బ్యూటీ,స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా గిన్నెలు తోమి తన కుటుంబసభ్యులకు సాయం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న కత్రినా ఇంట్లో సింక్ లో ఉన్న గిన్నెలు కడిగారు.

దీనికి సంబందించిన వీడియో ను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తో ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. మొత్తానికి ఈ కరోనా లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీలు సైతం ఇంటి పనులు చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా దేశ్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను కొనసాగించాలి అంటూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.