బాలీవుడ్ హీరో భార్య అవుతున్న కీర్తి సురేష్..!

4

మహానటి సినిమాతో సౌత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటుంది కీర్తి సురేష్. మళయాళం నుండి వచ్చిన కీర్తి సురేష్ తన అభినయంతో అదరగొడుతుంది. తెలుగులో అజ్ఞాతవాసి తర్వాత ఈమధ్యనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది కీర్తి సురేష్. మరో పక్క తమిళంలో స్టార్స్ హీరోస్ తో వరుస ఛాన్సులు అందుకుంటుంది.

ఇదిలాఉంటే కీర్తి సురేష్ ఓ బాలీవుడ్ హీరో భార్య అయ్యేందుకు సిద్ధమైందట. ఏంటి కీర్తి సురేష్ అప్పుడే పెళ్లి చేసుకుంటుందా.. కీర్తిని పెళ్లాడే ఆ హీరో ఎవరు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలుసుకోవాలని ఉంటుంది. అయితే కీర్తి సురేష్ బాలీవుడ్ హీరోకి భార్య అవుతుంది కాని అది రీల్ లైఫ్ లో మాత్రమే. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ చేస్తున్న ఫుట్ బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత కథ అధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందట.

అమిత్ శర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీలో ఛాన్స్ వచ్చినందుకు కీర్తి సురేష్ ఎంతో సంతోష పడుతుంది.

amazon ad