కేజీఎఫ్ 2 రిలీజ్ ఎప్పుడంటే…!

-

కేజిఎఫ్’ ఇండియన్ సినిమాలో ఈ పేరు ఒక సంచలనం. 5 భాషల్లో ఈ సినిమా ఒక రకంగా సంచలనం సృష్టించింది. ఆ సినిమా తీసే సమయంలో కూడా ఇంత పేరు వస్తుందని చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా అనుకుని ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో హిట్ అయింది ఈ సినిమా. వసూళ్ళ పరంగా కూడా కొత్త సంచలనాలు నమోదు చేసింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగ౦ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. కెజియఫ్ 2 సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకేరోజు విడుదలవుతుంది. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెరకెక్కింది ఈ సినిమా.

రెండో భాగంలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ సినిమా హక్కుల కోసం అన్ని భాషలు ఆసక్తిగా చూస్తున్నాయి. మన తెలుగులో ఎవరు కొంటారు అనేది చూడాలి. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు కొనగా 13 కోట్లు వసూళ్లు చేసింది. హిందిలో 40 కోట్లకు పైగా వసూలు సాధించింది. తమిళనాడు లో కూడా 10 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news