కరోనా వైరస్ పుణ్యమా అని స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉండగా బంగారం ధరలు కూడా అదే స్థాయిలో పడిపోతున్నాయి. రెండు రోజుల నుంచి స్వల్పంగా పడిపోతున్న బంగారం ధరలు శుక్రవారం సాయంత్రం భారీగా పడిపోయాయి, పెట్టుబడి దారులు పెట్టుబడులు మళ్లించడం, రూపాయి బలపడటంతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ.1097 తగ్గి రూ.42,600కు చేరింది. శుక్రవారం ఉదయం 500 పైగా తగ్గింది.
గత సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.43,697గా నమోదైంది. మరింతగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడి దారులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. దానికి తోడు డిమాండ్ కూడా తగ్గుతుంది. కరోనా దెబ్బకు నష్టాలను బంగారం అమ్మి పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. 40 వేల దిగువకు బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో కొనుగోలు దారులు ఆసక్తి చూపిస్తున్నారు.