రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో..!

-

ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాలలో భారీ పాపులారిటీ దక్కించుకొని ఇప్పుడు రాజకీయాలలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తమిళనాట భారీ పాపులారిటీ అందుకున్న విజయ్ అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకొని దక్షిణాది హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఆయన రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లక్ష్యంగా ఆయన సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. పైగా ఈ మధ్యకాలంలో తమిళనాడులో పలుచోట్ల సంక్షేమ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా అందరికీ కేంద్రము ఆహారాన్ని అందించాలి అని విజయ్ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన స్వయంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మరొకవైపు పలువురు రాజకీయ నేతల పుట్టినరోజు వేడుకలకు కూడా వరుసగా హాజరవుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కుల సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జూన్ 17వ తేదీన ఘనంగా సత్కరిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై నీలగిరిలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడంతో పాటు నగదు ప్రోత్సాహం కూడా అందించనున్నట్లు విజయ్ పీపుల్స్ మూమెంట్ ప్రకటించింది. వీటన్నిటిని చూస్తుంటే విజయ్ రాజకీయాలను కేంద్రీకృతం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు అని సమాచారం. ఇకపోతే ఇప్పటికే విజయ్ పీపుల్స్ ఫోరంలో మహిళ, మత్స్యకారులు, విద్యార్థి, కార్మిక టీమ్లతో సహా మొత్తం పది టీములు ఉన్నాయి. కచ్చితంగా ఇవన్నీ కూడా ఆయనను గెలిపించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version