కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్య కృష్ణ చిన్న కర్మ.. పూర్తి..!

-

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రజలందరినీ శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యావత్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు అందరూ కూడా ఘనంగా ఆయనకు వీడ్కోలు పలికారు. ఆర్తనాధాల మధ్య కృష్ణ పార్థివ దేహం మహాప్రస్థానానికి తరలించినప్పుడు చాలామంది గుండెలవిసేలా రోదించడం చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురి అవుతున్నారు. నిన్నటికి ఆయన మరణించి మూడు రోజులు అవుతున్న నేపథ్యంలో చిన్న కర్మ జరిపించారు.

ఇక నవంబర్ 17వ తేదీన కుటుంబ సభ్యులు కృష్ణ గారి చిన్నకర్మ మూడవ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, మహేష్ బాబు, మంజుల , నమ్రత , సుధీర్ బాబు, గల్లా జయదేవ్ తదితర కుటుంబ సభ్యులు కృష్ణకి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక అమెరికాలో ఉన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణతోపాటు దూర ప్రాంతాలలో ఉన్న ఇతరులు కూడా వచ్చి చిన్నకర్మకు హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, మహేష్ బాబు సన్నిహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఇక సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్ తో పాటు తదితర నటీనటులు కూడా కృష్ణ గారి చిన్నకర్మకు హాజరయ్యారు. ఇకపోతే కృష్ణ గారి మరణంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇదే ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ లో అమ్మ ఇందిరాదేవి, నవంబర్లో నాన్న కృష్ణ.. ఇలా ముగ్గురు కోల్పోవడంతో మహేష్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి మహేష్ బాబు బయటపడి తన తదుపరి పనులపై దృష్టి సారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news