రాధేశ్యామ్ లో కృష్ణం రాజు.. పోస్ట‌ర్ విడుద‌ల

యంగ్ రెబ‌ల స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. ప్ర‌భాస్ హీరోగా వ‌స్తున్న రాధేశ్యామ్ సినిమా లో రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌టిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌నను రాధేశ్యామ్ చిత్ర బృందం ట్విట్ట‌ర్ ద్వార ప్ర‌కటించింది. రాధేశ్యామ్ లో కృష్ణం రాజ్ ప‌ర‌మ‌హంస పాత్ర లో న‌టిస్తున్నాడ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన ఫోటో ను కూడా చిత్ర బృందం ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. టాలీవుడ్ లేజండ‌రీ న‌టుడు కృష్ణం రాజ్ అంటు క్యాప్ష‌న్ ను కూడా పెట్టింది. అలాగే ఈ సినిమా లో కృష్ణం రాజు ప‌ర‌మ‌హంస పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని కామెంట్ చేసింది.

కాగ ప్ర‌భాస్ , కృష్ణంరాజు క‌లిసి న‌టించ‌డం ఇది మూడోసారి గ‌తంలో బిల్లా, రెబ‌ల్ సినిమాల‌లో ప్ర‌భాస్ తో కృష్ణం రాజు న‌టించాడు. తాజా గా రాధే శ్యామ్ లో కూడా న‌టిస్తున్నాడు. కాగ ఈ సినిమా ను డైరెక్ట‌ర్ రాధ కృష్ణ తెర‌కెక్కిస్తున్నాడు. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన సాంగ్స్, టీజ‌ర్ తో ఇప్ప‌టికే ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజా గా కృష్ణం రాజు న‌టిస్తున్నాడ‌ని ప్ర‌క‌టించ‌డం తో అంచ‌నాలు ఇంకా పెరిగిపోయాయి.