కృష్ణంరాజు మృతి.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

-

దిగ్గజ నటుడు కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే.. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయనున్నారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే ప్రకటించింది తెలంగాణ సర్కార్‌.

ఇక అటు కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news